#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

VUYYURU SUBHASH
మెగాస్టార్ చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ఆచార్య సినిమాను కంప్లీట్ చేశారు. ఈ సినిమా తో పాటు మోహ‌న రాజా ద‌ర్శ‌క‌త్వంలో మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ వంటి చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి పోయారు. ఇందులో మోహ‌న రాజా సినిమాకు గాడ్ ఫాద‌ర్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్ర‌మంలోనే జై ల‌వ‌కుశ‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి) ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు #Mega154 ప్రాజెక్టు గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ మైంది. ఈ వేడుక‌లో ఇండ‌స్ట్రీ కి చెందిన ప‌లువురు పాల్గొని చిరు తో పాటు ద‌ర్శ‌కుడు బాబికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే సినిమా మేక‌ర్స్ చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ ఫ్యాన్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టు కుంటోంది. చేతికి మెడ‌లో పెద్ద గొలుసు వేసుకుని చాలా స్టైల్ గా చిరు బీడీ అంటి చు కుంటున్నారు.

ఏదేమైనా ఈ సినిమాలో చిరు మాస్ లుక్ తో అద‌ర గొట్టేయ‌డంతో పాటు సినిమా పై ఒక్క సారిగా అంచ‌నాలు పెంచేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ఓ మత్స్యకారుడిగా రోల్ లో కనిపించనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చెన్నై చిన్న‌ది త్రిష ఎంపికై న‌ట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: