రూమర్స్ దెబ్బకు బాలీవుడ్ హీరో లైఫ్ స్పాయిల్?

NAGARJUNA NAKKA
హృతిక్‌ రోషన్‌ కెరీర్‌ అప్ అండ్‌ డౌన్స్‌లో ఉన్నప్పుడు 'క్రిష్' సీరిస్‌ ఆదుకుంది. ఈ ప్రాంచైజీలో వచ్చిన మొదటి రెండు సినిమాలు హృతిక్‌కి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాయి. అయితే 'క్రిష్3' మాత్రం తలనొప్పులు తెచ్చింది. ఈ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా చేసిన కంగన రనౌత్‌తో జరిగిన ఈమెయిల్స్‌ కేసుల తర్వాత కెరీర్‌ కూడా కుంటుపడింది.
బాక్సాఫీస్‌ని మెప్పించడానికి కూడా తంటాలు పడుతున్నాడు హృతిక్‌ రోషన్‌. ఫ్లాపులతో పడిపోయిన మార్కెట్‌ని మళ్లీ సంపాదించుకోలేకపోతున్నాడు. కంగన రనౌత్‌కి అజయ్‌ దేవగణ్‌తో బ్రేకప్ అయ్యాక బ్రిటీష్ డాక్టర్ నికోలస్‌ లాఫెర్టీతో ప్రేమలో పడిందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ స్టోరీ కూడా ఎక్కువ కాలం కంటిన్యూ కాలేదు. ఇలా డైలీ సీరియల్‌లా సాగిన బ్రేకప్‌ల తర్వాత హృతిక్‌ రోషన్‌కి దగ్గరైంది కంగన రనౌత్. హృతిక్‌ రోషన్‌ ఈమెయిల్స్‌ పంపించాడని, తమ ఇద్దరి మధ్య ప్రేమ కథ నడిచిందని పబ్లిక్‌గానే చెప్పింది. కానీ హృతిక్‌ రోషన్‌ మాత్రం కంగనకి ఎప్పుడు మెయిల్స్‌ పంపలేదని చెబుతూ ఉంటాడు.  అయితే ఈ గొడవల మధ్యలోనే హృతిక్‌ రోషన్‌ భార్య సుశానే ఖాన్‌తో విడిపోయాడు. ఇక పర్సనల్‌ లైఫ్‌లో డిస్ట్రబెన్సెస్‌తో పాటు కెరీర్‌లోనూ ఒడిదుడుకులు స్టార్ట్‌ అయ్యాయి.
హృతిక్‌ రోషన్‌కి 'క్రిష్3' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'బ్యాంగ్ బ్యాంగ్, మొహంజదారో' రిజల్ట్స్‌తో హృతిక్ గ్రాఫ్‌ డౌన్ అయ్యింది. ఆ తర్వాత వైవిధ్యంగా ఉంటుందని అంధుడిగా 'కాబిల్' సినిమా చేసినా మునుపటి మైలేజ్ రాలేదు. ఇక 'సూపర్ 30'లో హృతిక్‌ కొత్తగా ఉన్నాడనే ప్రశంసలు వచ్చినా నంబర్‌ గేమ్‌లో ముందుకెళ్లలేకపోయాడు. హృతిక్ రోషన్ ఇప్పుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలొచ్చాయి. అయితే ఈ మూవీస్‌ అంచనాలు అందుకోలేకపోయాయి. మరి ఇప్పుడు వస్తోన్న 'ఫైటర్' ఎలాంటి రిజల్ట్‌ తెచ్చుకుంటుంది, ఈ మూవీతో హృతిక్ మళ్లీ టాప్‌-3లోకి వెళ్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: