సూపర్ స్టార్ రజినీ రేంజ్ వేరే లెవెల్...

VAMSI

టాలీవుడ్ లో హీరోలకు కొదవ లేదు. కానీ టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఏ భాష అయినా గుర్తింపు పొందవచ్చు అభిమానాన్ని సంపాదించుకోవచ్చు అని ఎంతోమంది నిరూపించారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇటువంటి వారు చాలామందే ఉన్నారు. ఎందరో హీరోలు తమ భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ వారి సినిమాలు డబ్ చేసి హిట్స్ ను అందుకున్న వారు ఉన్నారు. అయితే వారి సొంత భాషలతో పాటు సమానంగా లేదా అంతకు మించిన ఆదరణ ఇతర భాషల్లో పొందడం అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అలాంటి నటులు చాలా తక్కువనే చెప్పాలి. కాగా ఆ కోవకు చెందిన ప్రతిష్టాత్మక నటుడు రజినీ కాంత్...పేరుకు తమిళ హీరోనే అయినా ఇటు తెలుగులోనూ అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సీనియర్ హీరోకి తెలుగు ప్రజలు జేజేలు పలుకుతుంటారు.

రజినీ సినిమా హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా కలెక్షన్ ల వర్షం కురిపిస్తారు. ఇదియు చాలా సార్లు రుజువయింది. ఈ విషయం పక్కన పెడితే...తమిళంలో ఈ హీరో సినిమా వచ్చింది అంటే అది తెలుగులోనూ రిలీజ్ అవ్వాల్సిందే. చాలా వరకు ఈయన సినిమాలు ఇరు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను  సూపర్ స్టార్ ఫ్యాన్స్ సైన్యం చాలా పెద్దదే. ఇది ఒక్కటి చాలు తెలుగులో ఆయన రేంజ్ ఏంటో చెప్పడానికి తన స్టైల్ తోనే సినిమా భారం మొత్తాన్ని తన భుజంపై మోయగల సూపర్ హీరో మన రజినీ కాంత్.

ఈయన డైలాగ్ డెలివరీకి, స్టైల్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ దేశ వ్యాప్తంగా ఉంది. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి రికార్డులు సృష్టించాయి. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ అగ్ర కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు  సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ రోబో మూవీ. దీని తర్వాతా సాలిడ్ హిట్ రాలేదు. ప్రస్తుతం పెద్దన్న మూవీ నిన్న దీపావళి కానుకగా విడుదలయి సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: