జై- బాలయ్య : బాలయ్య దెబ్బకు అన్ని షోలు మూసి వేయాల్సిందేనా..?

Divya
నటసింహం బాలకృష్ణను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ సంస్థ యొక్క పాపులారిటీని మరింత పెంచడం కోసం ఏకంగా బాలయ్యబాబు తోనే ఒక షో చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అల్లుఅరవింద్.. ఆ నిర్ణయం ఎన్నో చర్చలు జరిపిన తర్వాత బాలయ్య అయితేనే ఈ షో కి పూర్తిగా న్యాయం చేయగలడు అని అనుకున్నారట.. ఆ నేపథ్యంలోనే బాలయ్యను వెళ్లి అడగగా ఇప్పటి వరకు బుల్లితెర పై దర్శనం ఇవ్వని ఆయన ఎంతమంది వచ్చే అడిగినా నో చెప్పిన బాలకృష్ణ అరవింద్ అడగ్గానే ఒక్కసారిగా ఓకే చెప్పేశాడట.
అలా వచ్చిన షోనే అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే.. ఈ షోకి బాలకృష్ణ పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి.. ఎందుకంటే ఈ షోలో ఆయన వాక్చాతుర్యం, వచ్చిన సెలబ్రిటీలతో ఆయన మాట్లాడే మాటతీరు ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ దీపావళి కానుకగా ఈ రోజు ఆహా లో ప్రసారం కాగా ఇందులో మోహన్ బాబు.. మంచు లక్ష్మి.. మంచు విష్ణు లు హాజరయ్యి మంచి సందడి చేశారు. ఇక బాలకృష్ణ కూడా మోహన్ బాబు ని అడగాల్సిన అన్ని ప్రశ్నలను కూడా అడిగి ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు. మోహన్ బాబు గురించి ఇప్పటి వరకు అన్ని సందేహాలు ఈ షో తో పటాపంచలై పోయాయి.

అటు రాజకీయ పరంగా మోహన్ బాబు ఎదుర్కొన్న కష్టాలు గురించి కూడా అడిగాడు. అంతేకాదు బాలకృష్ణ తన వ్యక్తిగత విషయాలను కూడా అడిగి అందరికీ తెలియజేశారు.. ఇప్పటివరకు పలు బుల్లితెర ఛానల్స్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు హోస్టులుగా ఎన్నో షోలకు వ్యవహరించినప్పటికీ, బాలయ్య ముందు అందరూ దిగదుడుపే అని అంటున్నారు నెటిజన్లు. షో తో ఒక్కసారిగా అందరి స్టార్ హీరోలకు మతిపోయినట్టు  అనిపించేలా బాలకృష్ణ హోస్ట్ గా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇకపోతే అల్లు అరవింద్ అనుకున్న కల కూడా నెరవేరిందని ,ఆహా టిఆర్పి రేటింగ్ కూడా దూసుకుపోతోంది అని ప్రతి ఒక్కరూ అప్పుడే అంచనాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: