చిరంజీవి పెళ్లి చేసుకుంది మా ఇంటి ఆడపిల్లనే: మోహన్ బాబు

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులుగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక ఇద్దరు కూడా నటనలో ఆరితేరారు అని చెప్పాలి. ఇప్పటికే వందల సినిమాల్లో కూడా నటించారు. అయితే ఎన్నో రోజుల నుంచి వీరిద్దరి మధ్య శత్రుత్వం ఉందని ఒకరంటే ఒకరికి పడదు అంటూ టాలీవుడ్ లో ఎన్నో రకాల వార్తలు హల్ చల్ చేశాయి అనే విషయం తెల్సిందే. కానీ ఒకానొక సమయంలో ఒక సమావేశంలో ఏకంగా మోహన్ బాబు చిరంజీవి అందరి ముందే వచ్చి కౌగిలించుకోవడం ఆ తర్వాత చెంపపై ముద్దు పెట్టుకోవడం తో ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని ఇద్దరు స్నేహితులు గానే కొనసాగుతున్నారు అన్న దానిపై క్లారిటీ వచ్చింది.



 అయితే ఇటీవలే మా ఎలక్షన్స్ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూల కు హాజరైన మోహన్ బాబు చిరంజీవి తో స్నేహం గురించి చేసిన వ్యాఖ్యలపై మాత్రం మరోసారి వీరి స్నేహం తెర మీదికి వచ్చి చర్చకు వచ్చేలా చేస్తాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మంచు వారి ఫ్యామిలీ మొత్తం అటు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న unstoppable అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. మొదటి ఎపిసోడ్ లోనే మంచు వారి ఫ్యామిలీ సందడి చేయడం గమనార్హం. సాధారణంగా అయితే మంచు మోహన్ బాబు ను ఇంటర్వ్యూ చేయడానికి ఏ యాంకర్ అయినా సరే భయపడుతూ ఉంటారు. కానీ  నందమూరి బాలకృష్ణ మాత్రం ఎలాంటి భయం బెరుకు లేకుండా మంచు మోహన్బాబును అన్ని రకాల ప్రశ్నలు అడిగారు.



 ఇక బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు అటు మంచు మోహన్ బాబు కూడా షాకింగ్ సమాధానాలను చెప్పారు అని చెప్పాలి ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో తన మిత్రుడు అని చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు మోహన్ బాబు. చిరంజీవి పెళ్లి చేసుకుంది మా ఇంటి ఆడపిల్లనే అంటూ చెప్పుకొచ్చాడు. రామలింగయ్య గారితో కలిసి నేను చాలా సినిమాలు చేశాను.. అయితే చిరంజీవి రామలింగయ్య గారి కూతురుని చేసుకున్నాడు అందుకే చిరంజీవి బాగున్నాడు అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. అంటే ఒకవేళ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే చిరంజీవికి లైఫ్ ఉండేది  కాదా.. ఎవరో అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం వల్లే చిరంజీవి కాస్త మెగాస్టార్ గా టాలీవుడ్ లో రాణించారా.. అన్న ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: