జై బాలయ్య: మోహన్ బాబు భార్య కు ధైర్యం చెప్పిన బాలయ్య...ఎందుకు..?
ఈరోజు అనగా దీపావళి సందర్భంగా నవంబర్ 4 వ తేదీన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపాబుల్ టాక్ షో మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యింది. ఎపిసోడ్ లో భాగంగా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ఈ టాక్ షో కు గెస్ట్ లుగా విచ్చేశారు. బాలకృష్ణ వీరితో సరదాగా ముచ్చటిస్తూ అనేక విషయాలను చర్చించారు. అందులో భాగంగా మంచు లక్ష్మి బాలకృష్ణ సంస్కారం గురించి ఒక పాత సంఘటనను వివరించింది. దొంగ రాముడు సినిమా సమయంలో మోహన్ బాబు కి దెబ్బ తగిలింది అంట, మెడ మీద ఆ దెబ్బ చూసిన తర్వాత బాలకృష్ణ కంగారు పడిపోయాడు అంట, హాస్పటల్లో బాలకృష్ణ కంగారు చూసి చచ్చిపోతాడు అని అనుకున్నారట, ఆ తర్వాత ఉస్మాన్ రోడ్డు కు తీసుకు వెళ్లి బొమ్మలు కొనిచ్చి వెంటనే మోహన్ బాబు ఇంటికి వెళ్లి నిర్మల దేవి కి ధైర్యం చెప్పాడట, ఈ సంస్కారం ఈ రోజుల్లో ఎవరికీ లేదు అని మేము ఈ సంఘటన మర్చిపోలేము అంటూ మంచు లక్ష్మి వివరించింది.