యాంకర్ సుమ..సినిమా కు సంబంధించి..పోస్టర్ వైరల్..!

Divya
వ్యాఖ్యాతగా బుల్లితెరపై సుమ ఎంతటి స్టార్డమ్ ను సంపాదించిందో మనకు తెలుసు. యాంకర్ల లో అత్యధికంగా బిజీ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతోంది. ఇక ఈమెకు ఎంతమంది యాంకర్లు పోటీగా వచ్చినా వారంతా నిలువలేక పోయారు. అయితే ఈమె సినిమాకు సంబంధించి తాజాగా ఒక సినిమా పోస్టరు విడుదలైంది వాటి గురించి చూద్దాం.
1996 సంవత్సరంలో "కళ్యాణ ప్రాప్తిరస్తు" అనే మూవీ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది సుమ. ఆ తర్వాత ఇతర భాషల్లో సైతం నటించింది. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో తన అడుగులు యాంకరింగ్ వైపు వేసింది. ఇందులో మాత్రం తను సక్సెస్ అయింది. ఇక అలాగే.. వర్షం, ఓ బేబీ వంటి సినిమాల్లో కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది సుమ. కొన్ని సినిమాలో సాంగ్స్  కూడా పాడి అలరించింది. ఇక ఎన్నో రోజుల తర్వాత మరి ఇప్పుడు నటిగా చేయడానికి సిద్ధం అయ్యింది సుమ.

తాజాగా సుమో నటిగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గా ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే దీపావళి సందర్భంగా ఆమె నటించబోయే సినిమా నుంచి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర మేకర్స్.ఇక పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో సినిమా రూల్ మీదున్న రోకలి అని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె చెయ్యి మీద వెంకన్న అనే పేరుతో గల పచ్చబొట్టును మనం గమనించవచ్చు.
ఈ సినిమాని వెన్నెల క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్గా బలగా ప్రకాష్ వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా ఎం ఎం కీరవాణి అందిస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించి టైటిల్స్ కానీ, ఫస్ట్ లుక్  వంటివి సంబంధించి నవంబర్ 6వ తేదీన తెలియజేస్తున్నట్లు గా చిత్ర బృందం తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల పాటు బుల్లితెరను ఏలిన సినిమా.. ఇప్పుడు వెండితెర మీద కనిపిస్తుండడంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: