కొత్త ప్రోమో తో అదరగొడుతున్న పవన్ కళ్యాణ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సంవత్సరం వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. ఇందులో భాగంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనూన్ కోషియన్ సినిమాకు తెలుగు రీమిక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా మరొక హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రోమో మరియు  పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలు కూడా మరింత పెంచాయి. అలాగే ఇప్పటికే రానాకు సంబంధించిన ప్రోమో ను కూడా భీమ్లా నాయక్ చిత్ర బృందం విడుదల చేయగా దీనికి కూడా జనాలు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.


 ఇలా ఒక దాని తర్వాత ఒక అప్డేట్ ను భీమ్లా నాయక్ చిత్ర బృందం బయటకు వదులుతూ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి పెరిగేలా చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా దీపావళి సందర్భంగా భీమ్లా నాయక్ చిత్రబృందం ఒక ప్రోమో ను బయటకు వదిలింది. దీపావళి సందర్భంగా భీమ్లా నాయక్ చిత్ర బృందం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమో లో పవన్ కళ్యాణ్...... నాగరాజు గారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి అంటూ డైలాగులను పలికాడు.. అదిరిపోయే టైమింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే జనాలలో ఫుల్ అంచనాలను  క్రియేట్ చేసిన భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. బిల్లా నాయక్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: