రాజమౌళితో వర్క్ చేయడం ప్రకాష్ రాజ్ కు అందుకే ఇష్టం లేదట?
అయితే ఇది చాలా సీరియస్ గా తీసుకోవలసిన విషయమే అని తెలుస్తోంది. మరి ఎందుకు అలా అని తెలుసుకుందాం. అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం దీనికో కారణం ఉందట. జక్కన్న సినిమా అంటే సక్సెస్ కి మరో పేరు. అలాగే ఆయన సినిమా అంటే యాక్టర్స్ ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సిందే. అయితే ఇదే కారణం చేత ప్రకాష్ రాజ్ జక్కన్న చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపరట. ఎప్పుడూ చేతిలో సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ నటుడు జక్కన్న చిత్రాలకు ఎక్కువ డేట్స్ ఇవ్వలేకే ఆయన సినిమాలకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీలో చెబుతున్నారు.
ఎప్పుడూ వరుస చిత్రాలతో ఫుల్ షెడ్యుల్ తో ఉండే ఈ నటుడు రాజమౌళి చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆయన సినిమాల్లో నటించరట. అయితే జక్కన్న తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ మర్యాద రామన్న చిత్రంలో మాత్రం ఓ సారి కనిపించారు నటుడు ప్రకాష్ రాజ్. కానీ ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలు మాత్రం చేయలేదన్నది వాస్తవం.