చైల్డ్ ఆర్టిస్ట్ గా హిట్... కానీ హీరోగా? మీరే చెప్పాలి?

VAMSI
టాలీవుడ్ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది బాల నటులు ఆ తరువాత హీరోలుగా మారారు. హీరో తనీష్ కూడా ఆ కోవకు చెందిన వాడే. బాల నటుడిగా పలు చిత్రాల్లో కనిపించిన తనీష్ బొద్దుగా ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా దేవుళ్ళు సినిమాలో దేవుడి పాత్రలో తనీష్ నటన తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేసింది. అలా బాల నటుడిగా కొన్ని సీనిమాలలో అందరినీ ఆకట్టుకుని 2008 లో "నచ్చావులే" సినిమాతో హీరోగా పరిచయమై రావడమే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస చిత్రాలతో హీరోగా బిజీ అయిపోయాడు ఈ కుర్ర హీరో. రైడ్, మౌనరాగం, ఏం పిల్లో ఏం పిల్లడో వంటి చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
కానీ కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయిన తనీష్ ఆ తరవాత వరుసగా సినిమాలు ఫ్లాప్ అయి కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ హీరో తెలుగు బిగ్ బాస్ లో కనిపించి మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా క్రేజ్ ను మళ్ళీ పెంచుకుని మరో ప్రస్థానం సినిమాను చేశారు తనీష్. జాని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ అనుకున్న ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు.   ఈ మధ్య డ్రగ్స్ కేసు విషయంలో కూడా తనీష్ పేరు గట్టిగానే వినిపించింది..అయితే తనకు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదని కేవలం ఆ నిర్మాతను సినిమా ఛాన్స్ కోసం కలవడం, ఆ తర్వాత పరిచయం పెరిగింది అని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే తనీష్ గురించి సోషల్ మీడియాలో విమర్శలు మరియు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఇవి అన్నీ మానేయండి అన్నీ చెప్పడం జరిగింది. పూర్తిగా తెలుసుకోకుండా ఏదంటే అది రాయకండి ప్లీజ్...అంటూ ఓ వీడియో అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో అయినా మంచి కథలను ఎన్నుకుని మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: