చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోలుగా సక్సెస్ అయినవారు వీరే?

VAMSI
సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు అన్న విషయం తెలిసిందే. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించి బుల్లితెర మరియు వెండితెరపై తమ సత్తా చాటిన నటులు కూడా ఎంతో మంది ఉన్నారు. చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఎందరో బాలనటులు ఆ తర్వాత హీరో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్లో రాణిస్తున్న వారు ఉన్నారు. కొందరు ఒకటి రెండు సినిమాలకే వెను తిరగగా ఇంకొందరు తమ టాలెంట్ తో సినిమాలలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ నటుల పిల్లలు అయిన మహేష్ బాబు, అఖిల్, తరుణ్ వంటి వారు ఫిల్మ్ బ్యాగ్రౌండ్ తో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించిన వారే.

మహేష్ బాబు 8 చిత్రాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తూ టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగాడు ఈ హీరో. అక్కినేని అఖిల్ సిసింద్రీ సినిమాలో ఒక సంవత్సరం వయసులోనే వెండి తెరపై కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. బహుశా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెత ఇతడికి సరిగ్గా సరిపోతుందేమో. అంత చిన్న వయసులోనే సన్నివేశానికి తగ్గ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు అఖిల్. వరుస చిత్రాలు చేస్తున్న అఖిల్ తాజాగా  "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రం ఇచ్చిన బిగ్గెస్ట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

తరుణ్ కూడా ఎన్నో చిత్రాలలో బాల నటుడిగా నటించి గొప్ప గుర్తింపు సంపాదించాడు. ఆదిత్య 369 సినిమాలో బాలనటుడిగా తరుణ్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత హీరోగాను ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా రాణించారు. ప్రస్తుతం కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఈ హీరో. ఇక తనీష్, తేజ సజ్జ, భరత్
వంటి వారు చైల్డ్ ఆర్టిస్ట్ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి హీరోలుగా మారారు.  వరుస చిత్రాలు చేస్తున్నారు. తేజ సజ్జ మరియు తనీష్ లు బాల నటులుగా ఉన్నప్పుడే స్టార్ యాక్టర్లు గా గుర్తింపు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: