సుశాంత్ మరణం ఇప్పటికీ సస్పెన్స్?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవిత గాథ వింటే కళ్ళు చెమర్చకుండా ఉండలేము. చిన్న స్టేజి నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అన్నిటినీ అధిగమిస్తు గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో అకాల మరణం అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. బుల్లితెరపై కనిపించిన వారు ఆ తర్వాత వెండి తెరపై హీరోగా అవకాశాలు అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది బుల్లి తెర నుండి వెండి తెరపై కనిపించడమే కాకుండా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. 2009 లో "పవిత్ర రిష్తా" సీరియల్ ద్వారా బుల్లి తెరకు ఈ యువ కథానాయకుడు పరిచయమయ్యాడు. మొదటి సీరియల్ తోనే సంచలనం సృష్టించాడు. టీవి నటుడిగా కెరియర్ ను ప్రారంభించిన ఈ కుర్రాడు అనతికాలంలోనే బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాలెంట్ హీరోగా గుర్తింపు పొంది పాపులారిటీ పెంచుకున్నాడు.
ఇతడు నటించిన 'ఎం.ఎస్.ధోని’, చిత్రం అటు సౌత్ లోనే కాదు ఇటు నార్త్ లో కూడా సక్సెస్ ని పొంది అందరి ఫేవరెట్ హీరోగా మారాడు. చిచోరే, దిల్ బెచారా వంటి చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. అలా వరుస అవకాశాలు అందుకుంటున్న నేపథ్యంలో ఇతడి హఠాత్ మరణం బాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసింది. పోలీసులు సుశాంత్ ది ఆత్మహత్య అని తెలిసినప్పటికీ ఇతడి మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే హత్య అని, డ్రగ్స్ అని చాలా కథనాలే వినిపించాయి. ఇప్పటికీ ఇతడి మరణం ఒక మిస్టరీగానే ఉంది.