ఎన్టీఆర్ నట విశ్వరూపానికి కేరాఫ్ అడ్రస్ ఆ సినిమా.. మీరు చూసారా?
ఇక అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా తనలోని నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా జై లవకుశ. అదుర్స్ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే అయితే ఈసారి కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నాడో ఏమో. ఏకంగా జై లవకుశ అనే సినిమాతో త్రిపాత్రాభినయం చేశాడు. ఇక ఈ సినిమా లోని మూడు రకాల పాత్రలు 3 వేరియేశన్స్ తో ఉంటాయి ముఖ్యంగా జై అనే పాత్ర నత్తి కలిగి ఉంటుంది. ఇక అలాంటి పాత్రలో కూడా అదిరిపోయే విధంగా డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయం ఇక మూడు పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం. తెలుగు ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా త్రిపాత్రాభినయం తో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాలో అటు ఎమోషన్స్ కూడా ఎంతో అద్భుతంగా పండాయి అని చెప్పాలి. అన్నదమ్ముల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఇలా సినిమాలోని పాటలు.. జూనియర్ ఎన్టీఆర్ నటన.. స్టోరీ లైన్ కూడా అద్భుతంగా ఉండటంతో ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించింది.