కన్నీరు పెడుతున్న "కర్ణాటక"... ఒక మంచి మనిషిని కోల్పోయింది...
అయితే అసలు ఎలా జరిగింది అని కంగారు పడుతున్నారు. ఎప్పటి లాగే ఈ రోజు ఉదయం ఆయన జిమ్ లో వరో ఔట్స్ చేయడానికి వెళ్లారు. కొంత సేపటికి కాలు తిరిగి కింద పడిపోయాడని గమనించిన గార్డ్స్ హాస్పిటల్ కి తరలించగా ఐసియులో చికిత్స పొందుతూ మరణించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది అని విలపిస్తున్నారు. ఇప్పటికీ ఈ వార్త దేశమంతటా వ్యాపించింది. దీనితో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కర్ణాటక మొత్తం హై అలెర్ట్ ప్రకటించింది. సినిమా పరంగానే కాకుండా సామాజికా కార్య్కర్మాలు చేయడంలోనూ పునీత్ ఎప్పుడూ ముందుండేవారు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీ తారలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇండస్ట్రీ మొత్తం ఈ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ వార్త విని తీరని ఆవేదనతో దుఃఖంలో మునిగిపోయారు. ఆ దేవుడు వారి కుటుంబానికి ఈ కష్టమైనా సమయాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్ధిద్దాము.