శింబు పై మరో కేస్ ఫైల్..!!

Divya
ఈ మధ్యకాలంలో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మరోసారి శింబుపై ఒక ప్రముఖ నిర్మాత చీటింగ్ కేసు పెట్టారు.. ఇప్పటికే పలు వివాదాలతో తలమునకలవుతున్నారు శింబు..ఇప్పుడు మరోసారి కేసు నమోదు కావడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నాడు.. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన మైఖేల్ రాయప్పన్ తాజాగా మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అంతేకాదు మూడు పేజీల ఫిర్యాదుతో చెన్నై లో ఉన్న పోలీసులకు ఇవ్వడం గమనార్హం.

ఫిర్యాదులో మైఖేల్ రాయప్పన్ ఏం తెలిపాడు అంటే.. శింబు వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నానని అంతేకాదు శింబుతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా నన్ను మానసికంగా వేధించారని, నిర్మాత ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే, 2016 వ సంవత్సరంలో శింబు హీరోగా నటించిన.. అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ అనే సినిమాకు నిర్మాతగా మైఖేల్ వ్యవహరించాడు.. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే సినిమాను శింబు విడుదల చేశాడు.. ఎంత చెప్పినా వినకుండా.. కష్టం వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి సినిమా విడుదల చేశాడు.. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత నష్టం మాత్రం తప్పలేదు.. ఇక మొత్తం పదిహేను కోట్ల రూపాయల నష్టాన్ని నేను ఈ సినిమాతో చవిచూడాల్సి వచ్చింది..
12 కోట్ల రూపాయలను పంపిణీదారులకు కట్టాల్సి ఉంది. ఇక ఆ నష్టం పూడ్చడానికి నాతో మరొక సినిమా చేస్తానని హామీ ఇచ్చిన శింబు ప్రస్తుతం ఆ హామీని నిలుపుకోలేదు.. ఆ సమయంలో నేను నిర్మాతల మండలి దగ్గరికి వెళ్లాను. అప్పుడు ప్రెసిడెంట్ గా విశాల్  వ్యవహరిస్తున్నాడు. విశాల్ ఆధ్వర్యంలో మా బ్యానర్లో మరో సినిమా చేయడానికి శింబు ఒప్పుకున్నా.. ప్రస్తుతం నిరాకరించాడు.. కొత్త అధ్యక్షుడు వచ్చినప్పటికీ తన హామీని శింబు మళ్లీ పక్కకు పెట్టాడు.. తల్లిదండ్రులు కూడా శింబు కే మద్దతు ఇస్తున్నారు.. నన్ను మానసిక క్షోభకు , ఆర్థికంగా నష్టాన్ని కలగజేసిన శింబు ను కఠినంగా శిక్షపడేలా చూడాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు మైఖేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: