పుష్ప మూడో పాట.. మామూలు గా ఉండదట!!

P.Nishanth Kumar
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి.

ప్రస్తుతం ఈ సినిమా బృందం మూడో పాటకు రంగం సిద్ధం చేసింది. దాక్కో దాకా మేక అలాగే శ్రీ వల్లి అనే రెండు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం సినిమా పై మంచి క్రేజ్ వచ్చేలా చేసుకుంది. ఈ సినిమాలో మంగ్లీ పాడిన తెలంగాణ ఫోక్ సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేయబోతున్నారు. ఈ పాట తప్పకుండా ప్రేక్షకులను బాగానే అలరిస్తుందని చెబుతున్నారు. తెలంగాణ జానపద పాటలతో బాగా పాపులరైన మంగ్లీ ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన పాట పాడగా ఈ చిత్రంలోని అన్ని పాటల కంటే సూపర్ హిట్ గా నిలిచి పోతుందని చిత్రబృందం చెబుతోంది.

అల వైకుంఠపురం లో సినిమా లో ఇప్పటికే అదరగొట్టే పాట పాడిన ఈమె ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో పాడనుందట. ఆ విధంగా పుష్ప సినిమాలో మంగ్లీ పాడిన పాట సినిమా పై ఎంతగానో అంచనాలు పెంచుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళ హీరో ఫాహద్ విలన్ గా నటిస్తుండగా తొలిసారిగా అల్లు అర్జున్ డి గ్లామర్ రోల్ పోషిస్తున్న డం విశేషం. భారీ స్థాయిలో అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్థు దో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: