' రిప‌బ్లిక్ ' ప్ర‌శంస‌లు ఫుల్‌... క‌లెక్ష‌న్లు నిల్‌... ఫైన‌ల్ లాస్ ఇదే..!

VUYYURU SUBHASH
మెగాస్టార్ చిరంజీవి  
మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ లేటెస్ట్ గా హీరోగా నటించిన చిత్రం రిపబ్లిక్ . ఈ సినిమా ఫైన‌ల్ బాక్సాఫీస్ రన్ ముగిసింది. తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక రిలీజ్ అయిన ఈ సినిమా కోసం ఇండ‌స్ట్రీలో చాలా మంది స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ప్ర‌మోష‌న్లు చేశారు. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి తో పాటు సినిమాలు ఎప్పుడూ చూడ‌ని సీత‌క్క లాంటి ఎమ్మెల్యే లు కూడా రిప‌బ్లిక్ సినిమా చూసి ఆకాశానికి ఎత్తేశారు.
ఓవ‌రాల్ గా రిప‌బ్లిక్ సినిమాకు మంచి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా రిప‌బ్లిక్ నిలిచింది. ఈ సినిమా కు అమ్మిన రేట్ల‌లో స‌గం కూడా రిక‌వ‌రీ కాలేదు. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ను వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 12 కోట్ల‌కు అమ్మారు. అక్టోబ‌ర్ 1న రిలీజ్ అయిన రిప‌బ్లిక్ 10 రోజుల‌కు గాను రు. 6 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత ఈ సినిమా ను జ‌నాలు ప‌ట్టించు కోలేదు.
ఇక ఇప్పుడు ఫైన‌ల్ గా బాక్సాఫీస్ ర‌న్ ముగిసింది. థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 5 కోట్ల రూపాయలు న‌ష్టం వాటిల్లింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నా యి . ప‌వ‌న్ - చిరంజీవి తో పాటు ప‌లువురు ఇండ‌స్ట్రీ వాళ్లు రిప‌బ్లిక్ కు ప్ర‌చారం చేసినా కూడా సినిమా జ‌నాల‌కు రీచ్ కాలేదు. అయితే ప్ర‌శంస‌లు మాత్రం ద‌క్కాయ‌న్న సంతృప్తి మేక‌ర్స్ కు ద‌క్కింది. ప్ర‌తి రోజూ పండ‌గే - చిత్ర‌ల‌హ‌రి - సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ లాంటి హిట్ల తో మాంచి జోష్ మీద ఉన్న సాయి కి ఇదో ప్లాప్ గా మిగిలింది. సాయి పూర్తిగా కోలుకుని నెక్ట్స్ సినిమా చేసేందుకు మ‌రో యేడాది ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: