షారుఖ్‌తో సినిమా.. సమంతకు మైండ్ పోయే రెమ్యునరేషన్ ?
ఈ సినిమా మాత్రమే కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో పెట్టింది. దీంతో పాటు కోలీవుడ్ నుంచి కూడా సమంతకు స్టార్ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు ఓ బాలీవుడ్ సినిమా లో కూడా ఆఫర్ వచ్చినట్టు టాక్ ? బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు ఆమె సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీమ్యాన్ -2 వెబ్ సిరీస్ తో అందరికి దగ్గరైన సమంత బోల్డ్ నటనకు అక్కడ ప్రేక్షకులు కూడా ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తోన్న సినిమాకు కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.
అట్లీ ఇప్పటికే సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే షారుక్ సైతం అట్లీకి బంపర్ ఛాన్స్ ఇచ్చాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్క నుందని తెలుస్తోంది. ఈ సినిమా లో ముందుగా నయనతారను హీరోయిన్ గా అనుకున్నారు. చివరకు ఆమె ప్లేస్ లో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు టాక్ ? ఆమె ఈ సినిమాలో నటిస్తోన్నందుకు గాను రు. 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట. సమంతకు పెళ్లయ్యి విడాకుల తర్వాత కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు.