సాయిబాబా భక్తులను నిరాశపరిచిన "శిరిడి సాయి"

VAMSI
సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి పతాకం పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన భక్తి కథా చిత్రం "షిరిడీ సాయి". ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని పొందలేదని చెప్పాలి. గతంలో వీరిద్దరి కాంబో లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించగా అదే స్థాయిలో ఈ సినిమా కూడా భక్తి పరవశంలో నిండి అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా బాబా భక్తులను ఆకర్షిస్తుందని అనుకున్న టార్గెట్ ను చేరుకోలేక పోయారు. ముచ్చటగా మూడో  సారీ కింగ్ నాగార్జునతో భక్తి కథా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించగా ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ సినిమా  అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడం నిజంగా అప్పట్లో సంచలనంగా మారింది.
భక్తి కథ చిత్రం అంటే నాగ్, రాఘవేంద్ర రావు కాంబోకి పెట్టింది పేరు. అలాంటిది ఈ చిత్రం కాస్త ఆ తరహా ఔట్ ఫుట్ ను పొందలేదనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. భక్తి  బయోపిక్ తరహాలో ఈ నిజ జీవిత కథను రూపుదిద్దినట్లు కాకుండా రెగ్యులర్ కమర్షియల్ తరహాలో కామెడీ, విలన్ అలా పరుచూరి వారి స్క్రిప్టుతో వెండి తెరపై  మెరిసిన ఈ చిత్రం సాయి భక్తులని మెప్పించలేకపోయింది. బాబా బయోపిక్ చూడాలని థియేటర్ కు వెళ్ళిన వారికి నిరాశే మిగిలింది. నటీనటుల్లో దాసగణు (శ్రీకాంత్‌), నానావళి (సాయికుమార్‌), మహల్సాపతి (శరత్‌బాబు), వేల్స్‌ (శ్రీహరి),  వంటి పాత్రలు బాగానే రక్తి కట్టించాయి. రాధాభాయిగా కమలిని ముఖర్జీ నటన ప్రేక్షకులకు పెద్దగా చేరలేదు.
వ్యాపారాత్మక చిత్రాలు తీయడం ఒక ఎత్తు అయితే, భక్తినిగొల్పే చిత్రాలు రూపొందించడం మరొక ఎత్తు ఇవి పూర్తిగా భిన్నం. భక్తి తరహాలో చిత్రాలను రూపొందించడంలో ప్రముఖుడు కె. రాఘవేంద్రరావు. భక్తిని, రక్తిని చక్కగా బ్యాలెన్స్ చేసే ఆయన గతంలో అన్నమయ్య మరియు శ్రీరామదాసు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నాగ్ తో తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు. ఈసారి ఈ సినిమాలో పెద్దగా భక్తుల అంచనాలకు రీచ్ అవలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: