ఫుల్ స్వింగ్ లో అక్కినేని హీరో నాగ చైతన్య!!

P.Nishanth Kumar
ఇటీవల లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాలు కూడా అదే రేంజిలో విజయవంతం చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న థాంక్యూ. చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో మనం లాంటి వెరైటీ చిత్రాన్ని తన కుటుంబానికి ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా కూడా ఎంతో వెరైటీ గా ఉండబోతుందని అంటున్నారు.

టైటిల్ థాంక్యూ లోనే ఈ సినిమా వెరైటీ గా ఉండబోతుందని విషయం తెలుస్తుంది.  అలాగే ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రంలో తండ్రితో కలిసి నటించబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుం ది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  అలాగే నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

ఇకపోతే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా నాగచైతన్య ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం కథలో కొన్ని కీలక మార్పు లు చెప్పినట్లు తెలుస్తుంది.  అవి మార్చి  చైతన్య కు నచ్చేలా సినిమా చేసి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను రూపొందించబోతున్నారట. అలాగే నాగచైతన్య యాక్ష న్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ యాక్షన్ సబ్జెక్టును నాగచైతన్యకు వినిపించగా అది కూడా ఓకే చే సే ఆలోచనలో ఈ అక్కినేని వారసుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందరి హీరోలలాగే తాను కూడా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: