మహాసముద్రం సినిమాను రిజెక్ట్ చేసిన సమంత ఎందుకంటే..??

N.ANJI
అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న సినిమా మహాసముద్రం. ఈ సినిమాని దసరా కానుకగా ఈ నెల 14వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావ్ హైదరీ కథానాయకులుగా నటించారు. ఈ మూవీలో నటించిన హీరోలు, హీరోయిన్లు వరుస ఫ్లాపుల్లో ఉండటంతో ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడిస్తున్నారు.
అయితే ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి మహా సముద్రం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించాలని అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో తొలి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుల రెండో సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదితి రావు హైదరీ నటించిన పాత్రకు దర్శకుడు మొదట సమంతను సంప్రదించారంట. అంతేకాదు.. కొన్ని కారణాల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం.
ఇక శర్వానంద్, సమంత కాంబినేషన్ లో జాను సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. జాను సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం రాబట్టలేదు. అంతేకాదు.. శర్వానంద్, సమంత జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి మరి. కాగా.. ఆ కారణం వల్లే కథ, పాత్ర నచ్చినప్పటికీ సమంత మహాసముద్రం సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. 
ఇక మరోవైపు ఈ సినిమాలో సిద్దార్థ్ ఒక హీరోగా నటిస్తూ ఉండటం వల్ల కూడా సమంత ఈ సినిమాకు నో చెప్పి ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాదు.. సమంత ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక సమంత కొత్త సినిమా షూటింగ్ లతో త్వరలో బిజీ కానున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: