
విష్ణు తెలుగుపై నాగబాబు సెటైర్లు ?
సలీం చిత్రం విషయం లో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగ తి పట్టించారని... మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెను తిరిగారని ఫైర్ అయ్యారు నాగబాబు. మీ వివాదా ల్లో తప్పెవరితో మాకు తెలియదని... ప్రకాశ్ రాజ్ వివాదా ల్లో తప్పెవరితో మీకు తెలియదన్నారు నాగ బాబు. విష్ణు నువ్ ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్... విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగు వాళ్లు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మెగా హీరో నాగబాబు.
ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణు కు పాస్ మార్కులు కూడా రావని ఎద్దేవా చేశారు నాగబాబు. ప్రకాశ్ రాజ్ ని తెలుగోడం టారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని చురకలు అంటించారు నాగబాబు. సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే తన మద్దతు ఉంటుం దని స్పష్టం చేశారు మెగా హీరో నాగబాబు.