మెగా హీరో వైష్ణవ్ తేజ్ మరోసారి పంజా విసురుతాడా?

VAMSI
మామూలుగా తెలుగు సినిమా పరిశ్రమలో వేల మంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు అయితే అవకాశాలు దక్కించుకుని ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. మరి కొందరు అంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుని మంచి స్థాయికి వెళతారు. ఇక్కడ రాణించాలంటే తన స్వశక్తితో పాటుగా కొంచెం ఫేం ఉండాలి. ఒకటి రెండు సినిమాలకు అయితే బ్యాక్ గ్రౌండ్ ఫేం హెల్ప్ అవుతాయేమో కానీ ఆ తర్వాత తనకు టాలెంట్ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సక్సెస్ అయ్యారు. మరియు కొంత మంది ఒకటి రెండు సినిమాలతో మాత్రమే విజయాన్ని దక్కించుకుని కనుమరుగైపోయారు. అదే బ్యాక్ గ్రౌండ్ తో ఈ మధ్యనే తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్.

గత సంవత్సరం కరోనా తర్వాత విడుదలైన చిత్రాలలో ఒకటైన ఉప్పెనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా సూపర్ డుపర్ హిట్ గా నిలవడంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. దానితో వైష్ణవ్ తేజ్ నటించబోయే తరువాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొండపొలం అనే  భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ రోజు మన ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.

ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్స్ పాటలు  సినిమాపై మరింత ఆశలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఒక కొండ ప్రాంతంలో నివసించే పాత్రలో వైష్ణవ్ నటిస్తున్నాడు. ఢీ గ్లామరస్ పాత్రలో మొదటి సారి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాలో నాజర్, కోట శ్రీనివాసరావు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మరి ఇంకాసేపట్లో థియేటర్లో విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. మొదటి సినిమా విజయం గాలి వాటం కాదని తనలో సత్తా ఉందని వైష్ణవ్ తేజ్ నిరూపించుకుంటాడా? అన్నది తెలియాలంటే కాస్త సమయం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: