మా అందం చూడండి అంటున్న సీనియర్ హీరోయిన్స్..!

NAGARJUNA NAKKA
సాధారణంగా కొత్త అందాలు సినీ ఇండస్ట్రీని పలుకరించినప్పుడల్లా.. పాతవాళ్లని పట్టించుకోరు అనుకుంటుంటారు చాలామంది. కానీ కొంతమంది సీనియర్ హీరోయిన్లు.. తమలో ఇంకా ఆ ఊపు తగ్గలేదని నిరూపిస్తున్నారు. కుర్రహీరోయిన్లకు ధీటుగా ఎక్స్ పోజింగ్ చేస్తూ అలరిస్తున్నారు. వీళ్ల అందం చూసిన కుర్ర భామలు జలసీగా ఫీలవుతున్నారు.

ఖుష్బూ సినిమాలు తగ్గించి చాలా కాలమైంది. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదుయ. కానీ రీసెంట్‌గా ఖుష్బూ పోస్ట్ చేసిన ఫోటోతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 50 ఏళ్ల వయసులో ఖుష్బూ ఇంత సన్నగా ఎలా తయారైందని చాలామంది ఆశ్చర్యపోయారు. అలాగే ఖుష్బూకి ఆఫర్స్‌ మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మాజీ హీరోయిన్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో కీ-రోల్ ప్లే చేస్తోంది.

రమ్యకృష్ణ హీరోయిన్‌గా రిటైర్ అయి చాలాకాలమైంది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌ చేసింది. ఆ తర్వాత సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్ అయ్యింది. అయితే అమ్మ పాత్రలు చేస్తున్నా రమ్యకృష్ణ క్రేజ్  మాత్రం తగ్గడం లేదు.  'బాహుబలి' తర్వాత ఈమె పాపులారిటీ మరింత పెరిగింది. అందుకే 50 ఏళ్ల వయసులో కూడా లీడ్ రోల్స్‌ ప్లే చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నాగార్జునతో జోడీ కట్టిన రమ్య, ఇప్పుడీ మూవీ ప్రీక్వెల్ 'బంగార్రాజు'లో హీరోయిన్‌గా చేస్తోంది.

విజయశాంతి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంది. అయితే హీరోయిన్‌గా రిటైర్‌ అయి 55 ఏళ్ల వయసులో మళ్లీ సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా విజయశాంతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 'సరిలేరు నీకెవ్వరు' ఫంక్షన్‌లో చిరంజీవి కూడా విజయశాంతి కటౌట్‌ చూసి ఆశ్చర్యపోయాడు. మళ్లీ కలిసి సినిమా చేద్దాం అన్నట్లుగా మాట్లాడాడు. మేకర్స్ కూడా ఆఫర్స్‌తో సిద్ధమవుతున్నారు. అయితే ఈమె మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్‌తో బిజీ అయ్యింది. చూద్దాం.. ఈ సీనియర్ హీరోయిన్లు ముందుముందు ప్రేక్షకులను ఎలా కవ్విస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: