ఆ ఇద్దరి పెళ్లి కోసం లొకేషన్ సెర్చ్..!
పుట్టిన రోజు వేడుకల కోసం ఆలియా భట్‌తో కలిసి ప్రైవేట్ జెట్‌లో జోధ్‌పూర్ వెళ్లాడు రణ్‌బీర్ కపూర్. అయితే ఈ ప్రేమ జంట జోధ్‌పూర్‌కి వెళ్లింది కేవలం బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే కాదు, వెడ్డింగ్ లొకేషన్‌ని కూడా వెతుక్కోవడానికే అనే సమాచారం అందుతోంది. అందుకే బ్లూ సిటీకి వెళ్లారనే టాక్ నడుస్తోంది. దీనికితోడు కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ పెడుతోన్న పోస్టులు కూడా ఈ పెళ్లి వార్తలకి బలాన్ని చేకూర్చుతున్నాయి.
రణ్‌బీర్ కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... అర్జున్ కపూర్ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో ఆలియా భట్‌ని కూడా ట్యాగ్ చేశాడు అర్జున్. అలాగే రణ్‌బీర్ మదర్ నీతూ కపూర్ కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్న ఫోటో షేర్ చేసి కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఇక ఈ ఫోటోలో ఆలియా భట్ కూడా ఉంది. దీంతో కపూర్ ఫ్యామిలీ ఇప్పటికే ఆలియానాని కోడలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ అఫీషియల్‌గా మ్యారేజ్ చేసుకోవడమే ఆలస్యమని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
గతేడాది కూడా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి ఇలాంటి వార్తలే వచ్చాయి. నీతూ కపూర్, సోనూ రజ్దాన్ ఇద్దరూ పెళ్లి షాపింగ్ కూడా చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ రాలియా పెళ్లి గురించి ఎలాంటి వార్తలు రాలేదు. మళ్లీ ఇప్పుడు కపూర్ల పోస్టులతో పెళ్లి మాటలు మొదలయ్యాయి. మరి 39 ఏళ్లు పూర్తి చేసుకున్న రణ్‌బీర్ కపూర్ ఈ ఏడాదైనా పెళ్లి పీటలెక్కుతాడా అనేది చూడాలి.