బంపర్ ఆఫర్ కొట్టేసిన ఐశ్వర్య రాజేష్ ?
ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించగా సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం రిలీజ్ అయిన రోజే హిట్ మూవీ గా టాక్ తెచ్చుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమాలో చేసిన ఐశ్వర్య రాజేష్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈమెకి తెలుగు లోనూ మంచి ఫ్యూచర్ ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు. అయితే తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య రాజేష్ కు ఒక బంపర్ ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది. ఒక స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్ గా చేయడానికి సంప్రదింపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు.
అంతే కాదు ఆ మూవీలో ఢీ గ్లామరస్ పాత్ర చేయనుందట ఐశ్వర్య రాజేష్. ఇంతకీ ఈ వార్త నిజమేనా. హీరో ఎవరు అన్న విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి రిపబ్లిక్ సినిమా ఐశ్వర్య రాజేష్ కు బాగా కలిసి వచ్చిందని టాలీవుడ్ లో అంతా అనుకుంటున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని ఆఫర్స్ వస్తాయో చూడాలి.