నాగ చైతన్య, సమంత విడిపోవటానికి కారణం అదేనా...?

murali krishna
సిల్వర్ స్క్రీన్ పై మంచి కపుల్‌గా నటించి రియల్ లైఫ్‌లో జంటగా మారిన నాగచైతన్య-సమంత పెద్ద అందరూ మెచ్చేంత జంటగా మారిపోయారు. సౌత్ ఇండియాలోనే కాదు హోల్ ఇండియాలోనే వీరిద్దరి ప్రేమ వివాహం ట్రెండ్ అయ్యిందని చెప్పవచ్చు.

వీరిద్దరి కాంబినేషనులో నాలుగు సినిమాలు కూడా వచ్చాయని అందరికి తెలుసు. తొలి సినిమా ఏమాయ చేశావే టైం నుంచే వీరి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా వీరు పెళ్లి చేసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది.ఇక కొద్ది రోజులుగా వీరి మధ్య గ్యాప్ ఏర్పడిందని కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అది చివరకు వీరు విడిపోయే వరకు వచ్చేసింందని తెలుస్తుంది.

తమ విడాకుల వార్తలపై ఈ జంట చాలా రోజుల వరకు స్పందించక పోవడంఅందరికి తెలిసిన విషయమే.కానీ ఇప్పుడే వచ్చిన తాజా న్యూస్ ప్రకారం నాగ చైతన్య సమంతతో విడిపోతున్నట్లు ప్రకటించాడు.
ఈ నేపథ్యంలోనే హీరో అక్కినేని నాగ చైతన్య తమ వివాహ బంధంపై సంచలన ట్వీట్ చేశాడని తెలుస్తుంది. సమంత మరియు తాను విడాకులు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడని తెలుస్తుంది.నాగచైతన్య ఇలా ట్వీట్ చేస్తూ సమంత నేను విడిపోతున్నామని సమంతతో దాదాపు పదేళ్ళ స్నేహానికి ముగింపు చెబుతున్నట్లు పేర్కొన్నాడట నాగ చైతన్య. క్లిష్ట పరిస్థితుల్లో తన వెంట ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడని తెలుస్తుంది. అంతే కాదు అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడట నాగచైతన్య. అటు సమంత కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించినట్లు సమాచారం.

 ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోవాలనుకుంటోంది అని అందరూ భాధపడుతున్నారట.అసలు అందుకు బలమైన కారణాలు ఏంటన్నదానిపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల లీకులు మరియు చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది.

సమంతపై అక్కినేని ఫ్యామిలీ ఆంక్షలు ఎక్కువ అవుతున్నాయట.. ఈ విషయంలో చైతు సమంతకు ఔననీ అలాగే కాదని చెప్పలేకపోవడం తో ఏర్పడిన గ్యాప్ క్రమంగా పెరిగిపోయిందని తెలుస్తుంది. సమంత డ్రెస్సుల విషయంలో అక్కినేని ఫ్యామిలీ బాగా ఆంక్షలు పెట్టిందని సమాచారం . నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కావచ్చు అలాగే బయటకు కావచ్చు ఆమె హాట్ హాట్ డ్రెస్సుల ఫొటో షూట్‌లు చేస్తూ వస్తోందని అందరికి తెలిసిన విషయమే.
 సమంత డ్రెస్ ల విషయంపై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అనేక కామెంట్లు కూడా వినిపిస్తున్నాయని తెలుస్తుంది.. ఇక సినిమాలు మరియు వెబ్ సీరిస్‌ల విషయంలో, డ్రెస్సులు వేసుకునే విషయంలో అక్కినేని ఫ్యామిలీ జోక్యంతో పాటు అమల కండీషన్లు సమంతకు ఇబ్బందిగా మారడం ఓ కారణం అని చెప్పొచ్చు.అలాగే చైతన్యతో పోలిస్తే సమంతకే ఎక్కువ క్రేజ్ ఉండటం కూడా మరొక కారణం అని తెలుస్తుంది.. ఈ కారణంగా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి చివరకు అది తీవ్రమైన ఇగోకు దారి తీసి విడిపోయేదాకా వచ్చినట్లు తెలుస్తుంది..

ఇక ది ఫ్యామిల్ మ్యాన్ 2 సిరీస్‌లో సామ్ బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇది కూడా అక్కినేని ఫ్యామిలీని తీవ్రంగా డిజప్పాయింట్ చేసిందని సమాచారం. అయితే ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీదే పూర్తిగా తప్పని చెప్పలేము. పెళ్లయ్యాక ఏ భారతీయ మహిళ అయినా కూడా సాంప్రదాయంగానే ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారని తెలుస్తుంది. అంతకు ముందు హీరోయిన్ అయినా కూడా అక్కినేని ఫ్యామిలీ కోడలు అయ్యాక అమల ఎప్పుడూ పరిధి దాటలేదని సమాచారం. ఇప్పుడు సామ్ విషయంలో వాళ్లు అదే కోరుకుని ఉంటారని తెలుస్తుంది. అయితే మోడ్రన్ గర్ల్ అయిన సమంత కు ఈ విషయం ఇది నచ్చకపోవచ్చని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: