వెనుక నుయ్యి.. ముందు గొయ్యి.. దిల్ రాజు దారెటో?
నామీద కోపం ఉంటే నన్ను ఏమైనా అనాలి కాని తెలుగు చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు పరిస్థితి అయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా మారిపోయింది. ఓవైపు అటు జగన్ ప్రభుత్వంలోని మంత్రులతో చర్చలు జరపడంతో పాటు మరో వైపు పవన్ కళ్యాణ్ తో కూడా ఉంటున్నారు దిల్ రాజు.
అయితే ఇటీవలే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఏపీ మంత్రి నానితో మీడియా సమావేశంలో కనిపించిన ప్రొడ్యూసర్ దిల్రాజు.. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ తో ఎంతో క్లోజ్ గా ఫోటో దిగారు. ఇక దీనికి సంబంధించిన రెండు ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారు పాపం దిల్ రాజు పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మొన్నటివరకు సినిమాలతో తిరుగులేని ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజుకు అటు పవన్ కళ్యాణ్.. ఇటు ఏపీ సర్కార్ తో సావాసం కత్తి మీద సాములా మారింది అని అంటున్నారు నెటిజన్లు.