దేశంలోనే మరొక అరుదైన గౌరవం.. లభించిన ఉపాసన కుటుంబం..!
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2021 ప్రకారం తేదీన జాబితాలో ప్రతాప్ రెడ్డి కుటుంబం భారతదేశంలో ఉన్న బిలియనీర్ లో 78 వ స్థానం లో పేరు నమోదు చేసుకుంది. ఇక వీరి కుటుంబం సంపద విలువ మొత్తంగా రూ. 21 వేల కోట్లు. ఇందులో మొదటి 15 మంది వ్యక్తులు మొదటిసారిగా భారతదేశ బిలియనీర్ వందమంది స్థానాలలో వారు కూడా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉపాసన కుటుంబం వారి సంపద 165 శాతం వరకు పెరిగిందని అంచనా.. ఇక ప్రతాప్ సి రెడ్డి గారు 1983 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన అపోలో హాస్పిటల్ ను స్థాపించారు.
ఇప్పుడు వీరికి అపోలో హాస్పిటల్స్, ఫార్మసీలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, టెలిమెడిసిన్ సెంటర్లు ,ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో పాటు పరిశోధన కేంద్రాలు.. ఇలా రకరకాలుగా వైద్య విద్యా కేంద్రాలు గా మారి దేశంలో ఉన్న ఎంతో మంది ప్రజలకు సేవలందిస్తూ.. అతిపెద్ద వైద్య ఇండస్ట్రీ గా పేరు తెచ్చుకుంది అపోలో హాస్పిటల్. ఇక తీసిన జాబితా ప్రకారం 56 మంది హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి 63 మంది బిలియనీర్లు ఉండడం గమనార్హం.