సాయి తేజ్ "రిపబ్లిక్" హిట్ అవుతుందా ?
ఇందులో పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రత్యేకంగా నిలిచింది. సాయి తేజ్ ఈ వేడుకకు రాకపోయినా పవన్ కళ్యాణ్ ఆ లోటును తెలియనివ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు సినిమా ఇండస్ట్రీ అటు పొలిటికల్ ఇండస్ట్రీ రెండూ బాగా డిస్ట్రబ్ అయ్యాయి. ఇదే ఈ సినిమా ప్రమోషన్ లాగా అయిపోయింది. ఈ సినిమాను ఈ రోజు థియేటర్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం గత వారం రిలీజ్ అయిన శేఖర్ కమ్ముల మూవీ లవ్ స్టోరీ మంచి టాక్ తో కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ రోజు నుండి రిపబ్లిక్ మూవీ రిలీజ్ అవుతుండడంతో లవ్ స్టొరీ పై ఈ ప్రభావం చూపిస్తుందా లేదా తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఈ సినిమాలో సాయి తేజ్ మరియు ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలలో విలక్షణ నటుడు జగపతి బాబు మరియు శివగామి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చక్కని బాణీలను అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్ మరియు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి. ఫ్యాన్స్ లో సాయి తేజ్ పై ఉన్న సానుభూతి ఈ మేరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా విజయం సాధించాలని మెగా ఫ్యాన్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. దర్శకుడు దేవా కట్టా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జె భగవాన్ మరియు పుల్లారావు లు జె బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. మరి సాయి తేజ్ ఈ సినిమాతో హిట్ ను అందుకుంటాడా అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే..