'లవ్ స్టోరీ' వల్ల నిద్రలేని రాత్రులు గడిపిన రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
తాజాగా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నికొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. నాగ్ చైతన్య, సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదలై ఇప్పటికే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా సక్సెస్ చూసి మిగతా సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు.ఇక ఇదిలా ఉంటె లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి కి బాబాయ్ పాత్రలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆయన తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.ఈ సినిమాలో చాలా రిస్కీ రోల్ ప్లే చేసారు రాజీవ్ కనకాల.

ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం అనేది నిజంగా సాహసమనే చెప్పాలి.ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. రాజీవ్ కనకాల ఈ పాత్రను చేయడానికి చాలా బాధపడ్డాడని చెప్పుకొచ్చారు.ఈ పాత్ర వల్ల రాజీవ్ కనకాల కొన్ని నిద్రలేని రాత్రులు గడిపారని శేఖర్ కమ్ముల అన్నారు.ఈ పాత్ర వల్ల ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారని..మాతో మాట్లాడే సమయంలో కూడా ఆ బాధను చెప్పుకున్నారని,రాజీవ్ కనకాల పోషించిన పాత్ర చేయాలంటే చాలా గట్స్ ఉండాలని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.ఒక పెద్ద ఇష్యుని తన భుజాలపై వేసుకొని రాజీవ్ కనకాల తెలిసేలా చేసారని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

ఆ పాత్ర చేసినందుకు రాజీవ్ కనకాల గారికి ధన్యవాదాలు చెనుతున్నానని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.ఇక రాజీవ్ కనకాల ఆ పాత్రకి ఒప్పుకున్న తర్వాత సుమ కూడా ఎంతో సపోర్ట్ చేసారని వెల్లడించారు శేఖర్ కమ్ముల.ఇక లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక చైతూ కెరీర్లో భారీ ఓపెనింగ్స్ అందుకుంది ఈ సినిమా.ఇక ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల మార్కెట్ కి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ వసూళ్లను సాధించిన సినిమాగా లవ్ స్టోరీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: