ఆ రెండు సినిమాలతో మహేశ్ బాబు డిసప్పాయింట్ !

NAGARJUNA NAKKA
టాలీవుడ్ ప్రముఖ హీరో మహేష్ బాబు తన సినీ జీవితంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలు రాబట్టింది. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చింది. అయితే ఆయన తీసిన బ్రహ్మోత్సవం మాత్రం ఫ్లాప్ చవిచూసింది. ఈ మూవీపై మహేశ్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఆయన ఆశలన్నీ అడియాశలయ్యాయి.

మహేశ్ బాబు సినిమా జీవితంలో బ్రహ్మోత్సం పెద్ద డిజాస్టర్ నే మిగిల్చింది. ఈ సినిమా పరాజయంతో శ్రీకాంత్ అడ్డాల పేరు దిగజారిపోయింది. ఇంతటి డిజాస్టర్ మూవీని తమిళనాట ఓ డైరెక్టర్ రీమేక్ చేసేందుకు సిద్ధమైనట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇది సినీ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రొడ్యూసర్ నటుడు చేరన్ ఈ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందింది. బ్రహ్మోత్సవం సినిమాలో తమిళ ఆడియన్స్ కు నచ్చే అంశాలున్నాయని ఆ నిర్మాత అభిప్రాయపడ్డాడు. మహేష్ బాబు సినీ జీవితంలో ఫ్లాప్ మూటగట్టుకున్న మూవీ కోలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి. అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. టాలీవుడ్ లో బ్రహ్మోత్సవం మూవీ 30 నుండి 40కోట్ల నష్టాన్ని మిగిల్చిందట.

మరోవైపు దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ మూవీ తెలుగులో ఫ్లాప్ ను చవిచూసింది. తమిళనాట పర్వాలేదనిపించుకుంది.  స్పైడర్ మూవీ దాదాపు 40కోట్ల రూపాయల నష్టం మిగిల్చినట్టు సమాచారం. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ ఫ్లాప్ ను ఒప్పుకున్నాడు. కథ వినూత్నంగా ఉన్నా.. మాస్ ప్రేక్షకులు ఆదరించలేదన్నాడు. తమిళ, తెలుగు నాట ఒకేసారి రిలీజ్ అయిన స్పైడర్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు చవిచూసేలా చేసింది. తమ సినిమా ఫ్లాప్ ను నిర్మాతలే ఒప్పుకోవడంతో ఇండస్ట్రీలో పారదర్శకత పెరిగిందని చెప్పొచ్చు. ఇలాంటి డిజాస్టర్లు మహేశ్ బాబు కెరియర్ లో రాకూడని అభిమానులు కోరుతున్నారు. తమ హీరో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వేడుకుంటున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: