మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం ఫుల్ జోష్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన 'క్రాక్' సినిమా తో రవితేజ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ఒక లిరికల్ సాంగ్ ను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇలా ఈ సినిమా చేస్తూనే రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ ఎమ్మార్వో పాత్రలో మనకు కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించబోయే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేసారు అనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘పెళ్లి సందD’ అనే మూవీ తో శ్రీలీల హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. లేడీ డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త పై క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.