ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేద్దామని.. డిజాస్టర్ గా మిగిలిన పవన్ కళ్యాణ్..?
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ఫ్యాంట్ ధర వేలం పాటలో కొన్ని లక్షల రూపాయల ధర కూడా పలికింది. 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే ఈ సినిమాలో ఫ్యాషన్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చూపించిన ఫ్యాషన్ కు యువత బాగా కనెక్ట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో డబల్ ప్యాంట్ వేసుకోవడం కొంచెం స్టైలిష్ గా అనిపించి యువత కూడా దీన్నే ఫాలో అయ్యారు.
ఇక ఈ సినిమాను కూడా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ప్లే రచించిన ఈ సినిమా కథ పై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. చివరికి ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూడడం తో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పవచ్చు.జానీ సినిమా ప్లాఫ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 9 వ సినిమా గుడుంబా శంకర్ . ఇక ఈ సినిమాని రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించ గా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.18 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్లాఫ్ గా నిలిచింది.. ఇక అలా వరుస సినిమాలతో బిజీ ఆ స్టార్ గా మిగిలాడు పవన్ కళ్యాణ్.