ఏఎన్ఆర్ హీరోగా మొదటి సినిమా ఏదో తెలుసా?

praveen
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబము నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసిన అక్కినేని నాగేశ్వరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన సినిమాలతో.. ఆయన మంచితనంతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ట్రెండ్ అని చెబుతూ ఉంటారు కదా. అలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ట్రెండ్ సెట్ చేశారు అక్కినేని నాగేశ్వరరావు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేయాలి అన్న ట్రెండును తిరగరాయాలి అన్న కూడా దానికి కేరాఫ్ అడ్రస్ ఏఎన్ఆర్ అన్న విధంగా మారిపోయారు. ఎందుకంటే ఆయన కెరీర్లో చేసిన వందల సినిమాల్లో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి అలరించారు.

 ఊర్లో ఉండే అబ్బాయి పాత్ర నుంచి మరోవైపు ఎంతో అద్భుతంగా చదువుకొని ప్రయోజకుడు అయినా  గవర్నమెంట్ ఆఫీసర్ పాత్ర వరకు.. తాగుబోతు పాత్ర నుంచి ఏకంగా అందరూ మొక్కే దేవుడు పాత్ర వరకు కూడా ఏఎన్నార్ నటించారు.  ప్రతి పాత్రకు కూడా ప్రాణం పోస్తూ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ గా  కొనసాగాడు అక్కినేని నాగేశ్వరరావు. ఇక ప్రేమకథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అక్కినేని నాగేశ్వరరావు ఎంతో మంది మగువల మనసులను కూడా కొల్లగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం మొత్తం ఎంతో అద్భుతంగా ఆసక్తికరంగా సాగింది అని చెప్పాలి. ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా మారిపోయాడు అక్కినేని నాగేశ్వరరావు. ఇకపోతే 1948వ సంవత్సరంలో ధర్మపత్ని అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడిగా మాత్రం నటించలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన సీతారామ జననం అనే సినిమాలో పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anr

సంబంధిత వార్తలు: