చిన్న సినిమాగా రిలీజ్ అయి ... పెద్ద సంచలనం సృష్టించిన హ్యాపీ డేస్ ... !

GVK Writings
మొదటి సారిగా అందరూ కొత్తవారితో శేఖర్ కమ్ముల తీసిన సినిమా డాలర్ డ్రీమ్స్. అయితే ఆ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. అనంతరం యువ హీరో రాజా, కమలిని ముఖర్జీ కలయికలో శేఖర్ తీసిన ఆనంద్ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సుమంత్ తో గోదావరి మూవీ తీసి మరొక విజయాన్ని సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల, దాని అనంతరం హ్యాపీ డేస్ మూవీ తీశారు. తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్, టైసన్, వంశీ కృష్ణ ఇలా దాదాపుగా అందరూ కొత్తవారితో అప్పట్లో శేఖర్ తీసిన ఈ సినిమా చిన్న మూవీ గా పెద్దగా అంచనాలు ఏమి లేకుండా విడుదలై పెను సంచలనమ్ సృష్టించింది అనే చెప్పాలి.
మొదటి రోజు నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి రాను రాను చాలా ప్రాంతాల్లో విపరీతంగా థియేటర్స్ పెంచడంతో పాటు యువత అయితే ఈ సినిమాకి మళ్ళి మళ్ళి వెళ్లి చూసారు. అది మాత్రమే కాక అనేకమంది ఇతర ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూసి తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. అంతబాగా ఈ సినిమా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. నాలుగు యువ కాలేజీ జంటల మధ్య  సాగె కథగా అందరినీ అలరించేలా ఎంతో చక్కగా శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
ఇక ఇందులో నటీనటులు అందరూ కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఎంతో బాగా నటించినా ఆడియన్స్ ని అలరించారు. ఇక ఈ మూవీ భారీ విజయం తరువాత హీరోయిన్ గా తమన్నా, హీరో నిఖిల్, ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. కాలేజీ యువత యొక్క మనసులోని భావాలకు అద్దంపట్టేలా శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాని ఇప్పటికీ కాదు అసలు ఎప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకాభిమానులు మరిచిపోలేరు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఇంకా తరచు ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి అంటే ఈ మూవీ క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో నిర్మాతలకు, బయ్యర్లకు ఎన్నో రేట్ల భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది హ్యాపీ డేస్ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: