పవన్ కోసం చిరు త్యాగం .... ??

GVK Writings
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. ఇటీవల మలయాళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా రానా డ్యానియల్ శేఖర్ పాత్ర చేస్తున్నారు. ఒరిజినల్ మాతృకకి కొద్దిపాటి మార్పులు చేసి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాని ఎంతో భారీగా తీస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో పాటు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్నాయి.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య నాగ వంశీ నిర్మిస్తుండగా రవి కె చంద్రన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్, డైలాగ్స్ రాస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా దీనిని వచ్చే ఏడాది పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే విషయం ఏమిటంటే నిజానికి భీమ్లా నాయక్ సంక్రాంతి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తరువాత కొద్దిరోజుల అనంతరం ఆ సినిమా స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ అవుతుందని, అలానే భీమ్లా నాయక్ వాయిదా పడుతుందని కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటన్నటికీ చెక్ పెడుతూ, తమ సినిమా ముందుగా ప్రకటించిన విధంగానే సంక్రాంతికి వస్తుందని ఇటీవల మేకర్స్ మరొకసారి కన్ఫర్మ్ చేసారు.
అయితే భీమ్లా నాయక్ విషయమై ఇటీవల ఒకానొక సందర్భంగా పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన చిరంజీవి, తన ఆచార్య ని సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు చెప్పారట. అయితే అప్పటికే భీమ్లా రిలీజ్ డేట్ ని సంక్రాంతికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసిన దర్శకనిర్మాతలు మరికొద్దిరోజుల్లో అధికారిక అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారట పవన్. అయితే కావాలంటే తమ భీమ్లా ని కొంత ముందుకు తీసుకెళ్తాము, వీలైతే ఆచార్య రిలీజ్ చేసుకోండి అంటూ పవన్ చెప్పిన మాటకు బదులుగా, అలా వాయిదా వేస్తే బయ్యర్స్ ఇబ్బందుల్లో పడతారని, ఎందుకంటే నిర్మాతలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినపుడు బయ్యర్స్ కి కూడా విషయం తెలిసే ఉంటుందని, ఆచార్య ఇంకా రిలీజ్ అనౌన్స్ చేయలేదు కాబట్టి రాబోయే నెలల్లో మంచి రోజు చూసి సినిమా రిలీజ్ చేస్తాం అంటూ చెప్పారట చిరంజీవి. ఆ విధంగా మెగాస్టార్ వెనక్కు తగ్గారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎంతైనా మెగాస్టార్ అంటే మెగాస్టారే మరి అంటున్నారు పలువురు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: