రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలివే?

VAMSI
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గురించి టాలీవుడ్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. స్టార్ కిడ్ గానే కాదు స్టార్ హీరోగా కూడా సత్తా చాటుతూ తన గ్రేస్ చూపిస్తున్నారు చెర్రీ. నటుడిగా, నిర్మాతగా మరో వైపు బిజినెస్ మ్యాన్ గా కీర్తి ప్రతిష్టలు పొందిన రామ్ చరణ్ తేజ్ గురించి కొన్ని తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* రామ్ చరణ్, రానాలు చిన్నపటి నుండి గొప్ప స్నేహితులు. అంతే కాదు క్లాస్మేట్స్ కూడా. మరియు అల్లు అర్జున్ వైఫ్ స్నేహ కూడా అదే స్కూల్ లో చదువుకున్నారు. రానా, చెర్రీ, స్నేహ ముగ్గురు కూడా క్లాస్మేట్సే. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉపాసన వీరికి జూనియర్. కాకపోతే ఈమె ఫోర్ ఇయర్స్ జూనియర్ కావడంతో ఉపాసనతో వీరికి చిన్నప్పుడు పెద్దగా పరిచయం లేదు అంతే.
* హీరోగా పరిచయమయిన రామ్ చరణ్ తేజ్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. అయితే అందరికీ తెలియని మరో సీక్రెట్ ఏమిటంటే ఇతడు గొప్ప సింగర్ కూడా, మెగాస్టార్ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు  ప్రజారాజ్యం పేరిట పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్ ప్రచారం సమయంలో ప్రజల కోరిక మేరకు పాటను పాడి వారిని సంతోష పెట్టారు చెర్రీ.  అప్పుడు అక్కడున్న ప్రజలు చెర్రీ మీలో మంచి సింగర్ దాగున్నారు అంటూ ఈలలు వేసి సంతోషంతో చిందులు వేశారు.
* తను నటించిన తుఫాన్ చిత్రంలో "ముంబైకా హీరో" పాట పాడే సమయంలో సింగర్స్ తో పాటు గొంతు కలిపారు చెర్రీ.
* రామ్ చరణ్ ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ మీడియా గణాంకాల ప్రకారం 2020 ఎండింగ్ కి 1400 కోట్ల రూపాయలని సమాచారం.
* రామ్ చరణ్ గొప్ప హీరోనే కాదు మంచి బిజినెస్ మ్యాన్ కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే చెర్రీ మొదట్లో మాటీవి బోర్డ్ మెంబర్ గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో పోలో క్లబ్ టీమ్ ను ప్రారంభించిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. మరో బిజినెస్ విషయం ఏంటంటే రామ్ చరణ్ ట్రూ జెట్ అనే పేరుతో విమానయాన సంస్థను నెలకొల్పారు.
* చాలా మంది సెలబ్రిటీలు అయ్యప్ప మాలను వేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే వారి వారి బిజీ షెడ్యూల్ ను బట్టి మాలను ధరిస్తుంటారు. అయితే చెర్రీ కూడా అయ్యప్ప మాలను చాలా శ్రద్ధగా ధరిస్తారు. అంతేకాదు  ఏకంగా ఒక మండలం (41 రోజులు) పాటు ఈయన అయ్యప్ప మాలను ధరించడం విశేషం.
* రామ్ చరణ్ తేజ్ గొప్ప యాక్టర్ మాత్రమే కాదు అంతకుమించిన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి  కూడా అని ఇండస్ట్రీలో అలాగే బయట చెర్రీకి మంచి పేరు ఉంది.
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి పేరును నిలబెట్టుకుంటూ జీవితంలో మరింత ఎత్తుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: