ఆర్ఆర్ఆర్ : ఆ విషయంలో నిజంగా పెద్ద మిస్టరీనే .... ??

GVK Writings
రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమురం భీం గా అలానే అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా ఈ ప్రతిష్టాత్మక సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ దగ్గరి నుండి మొన్నటి దోస్తీ సాంగ్ వరకు అన్ని కూడా ఆడియన్స్ లో సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచాయి అని చెప్పకతప్పదు.
సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తుండగా సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని, తాము గతంలో ప్రకటించినట్లుగా సినిమా అక్టోబర్ లో విడుదల కావడం లేదని, త్వరలో లేటెస్ట్ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని మూడు రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ యూనిట్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది.
అయితే నిజానికి ఈ సినిమా పై ప్రేక్షకాభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయని, ఇంత భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ కంటే దాని రిలీజ్ విషయం అందరిలోనూ అతి పెద్ద మిస్టరీ గా మిగిలిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మరొక్కసారి వాయిదా పడడంతో, అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో అనే అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ ఆర్ ఆర్ఆర్ మూవీ రిలీజ్ మిస్టరీ ఎప్పటికీ వీడేనో తెలియాలి అంటే పక్కాగా మూవీ రిలీజ్ విషయమై స్వయంగా దర్శకనిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు ఆడియన్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: