బెల్లంకొండ సాయి
శ్రీనివాస్ అల్లుడు శీను
సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలు చేసినా ఆయనకు ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ కూడా దక్కలేదు. భారీ బడ్జెట్లతో పెద్ద పెద్ద హీరోయిన్లతో ఆయన సినిమాలు తెరకెక్కించిన కూడా ప్రేక్షకులు ఇంత వరకు
బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. సినిమాల ఎంపికలో లోపం స్పష్టంగా కనిపించడం యాక్టింగ్ లో పురోగతి లేకపోవడం వంటివి
బెల్లంకొండ శ్రీనివాస్ వెనుక పడిపోవడానికి కాకపోవడానికి కారణాలు.
ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన చత్రపతి
సినిమా నీ
బాలీవుడ్ లో అదే పేరుతో వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మరి టాలీవుడ్లో
సక్సెస్ కానీ ఈ
హీరో బాలీవుడ్ లో ఏ రేంజ్ లో రానిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే బెల్లం కొండ వంశం నుంచి మరో
హీరో టాలీవుడ్ ఎంట్రీ చేస్తున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్
టాలీవుడ్ ఎంట్రీ ముహూర్తం ఖరారు అయిపోయింది.
స్వాతి ముత్యం అనే సినిమాతో ఆయన
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. గత కొన్ని రోజులుగా బెల్లం కొండ గణేష్
సినిమా ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
తాజాగా ఆయన నటిస్తున్న తొలి చిత్రం
స్వాతి ముత్యం
పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించిన
పోస్టర్ లో గణేష్ పాత్ర పేరు బాలమురళి అని తెలుస్తుంది. ఈ సినిమాలోని గణేష్ పాత్ర ఫార్మల్ డ్రెస్ లో భుజానికి వేసుకుని ఉండటం మనం
పోస్టర్ లో చూడొచ్చు.
లక్ష్మణ్ కే
కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ
సినిమా కి
మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తు ఉండగా
వర్ష బొల్లమ్మ
హీరోయిన్ నటిస్తుంది. మరి ఈ స్వాతిముత్యం
సినిమా తో బెల్లంకొండ గణేష్ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చాడో చూడాలి.