సందీప్ కిషన్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పుడో సినిమా లు చేయడం మొదలుపెట్టిన ఇప్పటివరకు మినిమం రేంజ్ హీరో గా కూడా సెట్ కాలేకపోయాడు. ఎన్ని సినిమాలు చేసినా గానీ ఒక హిట్టు కూడా రావడం లేదు ఆయనకు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తాజా చిత్రం గల్లీ రౌడీ ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను ఎంతో ఆసక్తికరంగా చేస్తున్నాడు హీరో సందీప్.
నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసిన సందీప్ కిషన్ సినిమా పై క్రేజ్ నెలకొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా వినోదాత్మకంగా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి చెప్పగా ఆయన ట్రైలర్ ను విడుదల చేయడం సినిమా కి మంచి బూస్ట్ నీ ఇచ్చిందని చెప్పొచ్చు. ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తి గా ఉంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉందని తేల్చి చెప్తున్నారు.
ఇక టైలర్ ను విడుదల చేసిన మెగాస్టార్ కు థాంక్స్ చెప్పింది చిత్ర బృందం. కోన వెంకట్ ఈ సినిమా కు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను సత్యనారాయణ నిర్మించగా ఈ సినిమా హిట్ కోసం వీరు చేయని ప్రయత్నం లేదు. సందీప్ కిషన్ టీజర్ ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో విడుదల చేయించగా ఇప్పుడు మెగాస్టార్ తో ట్రైలర్ ను విడుదల చేయించాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా మరి కొంత మంది పెద్ద హీరోలను తీసుకురాబోతున్నారట. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత ఎలాంటి హిట్ అందుకొని సందీప్ కిషన్ ఇప్పుడు ఈ సినిమాతో హిట్ సంపాదించాలని చాలా కసిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ ఇప్పుడైనా హిట్ కొడతాడా అనేది చూడాలి.