హరీష్
శంకర్ పవన్
కళ్యాణ్ రెండో
సినిమా భగత్ సింగ్
సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ సెట్ అవడంతో ఈ
సినిమా కూడా
గబ్బర్ సింగ్ సినిమా లాగే సూపర్ హిట్ అవుతుందని వారు భావిస్తున్నారు. 2012 లో వచ్చిన
గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అంటే అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్
కళ్యాణ్ ను ఈ
సినిమా ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకు వచ్చింది.
గబ్బర్ సింగ్
సినిమా ద్వారా పవన్
కళ్యాణ్ ను ఏ విధంగా చూడాలనుకున్నారో అదేవిధంగా చూపించి పవన్ అభిమానుల వద్ద వందకు వందశాతం మార్కులు కొట్టేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో
సినిమా కోసం ఎంతగానో ఎదురు చూడగా పవన్ రాజకీయాలకు వెళ్లడం అక్కడి నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేయడం హరీష్ తో
సినిమా చేయడం జరిగింది. ఆ విధంగా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న భగత్ సింగ్
సినిమా కూడా క్రేజీ
సినిమా గా మిగిలింది.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే
సినిమా లో ఈ సింగ్ అనే పదం మళ్ళీ రిపీట్ కావడం ఎంతో ఆసక్తిని నెలకొల్పుతుంది.
గబ్బర్ సింగ్ భగత్ సింగ్ ఈ రెండు పేర్లలో సింగ్ అనే పదం కామన్ గా ఉంది. అయితే మొదటి
సినిమా గబ్బర్ సింగ్ లో ఆ టైటిల్ ఎందుకు పెట్టాడో జస్టిఫికేషన్ ఇచ్చిన హరీష్ ఈ భవదీయుడు భగత్ సింగ్
సినిమా విషయంలో ఈ టైటిల్ ను ఎందుకు పెట్టాడో అన్న దాని పై తప్పకుండా క్లారిటీ ఇస్తాడు అని తెలుస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళపోతుంది.