విశ్వంభర వైపు అడుగులు వేస్తున్న రామ్ చరణ్ !

Seetha Sailaja
రామ్ చరణ్ తన కెరియర్ ను చాలా ప్లాన్డ్ గా మలుచుకుంటున్నాడు. లేటెస్ట్ గా శంకర్   దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఈమూవీ ప్రారంభంరోజున విడుదలైన పోస్టర్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు దర్శకుడు నిర్మాత సాంకేతిక నిపుణులు అందరు కలిసి ఒకే తరహా కాస్ట్యూమ్స్ వేసుకుని ‘We Are Coming’ అంటూ విడుదల చేసిన పోష్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రామ్ చరణ్ కియారా అద్వానీ తో పాటు దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజు మిగతా నటీనటులు సాంకేతిక నిపుణులతో సహా అందరు ఒకే తరహా సూటు కాస్టూమ్స్‌ లుక్ లో ఉన్న ఈ పోస్టర్ చరణ్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. రామ్ చరణ్‌ కెరియర్ కు సంబంధించి 15వ సినిమాగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  


‘విశ్వంభర’ అంటే భూమి అని అర్థం. వర్థమాన రాజకీయాల నేపధ్యంలో ఆవేశంతో రగిలిపోయే ఒక పోలీస్ ఆఫీసర్ రాజకీయాలలోకి వచ్చి ఈ వ్యవస్థను బాగు చేయాలని ప్రయత్నిస్తే అతనికి ఎదురయ్యే సమస్యల చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది అని అంటున్నారు. ఈసినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో తీయబోతున్నారు. గతంలో అర్జున్ నటించిన ‘ఒకేఒక్కడు’ మూవీకి సీక్వెల్ గా ఈమూవీ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఆమూవీలో ఒక జర్నలిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఈమూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుందని అంటున్నారు.  


ఒకప్పుడు దక్షిణాది సినిమా రంగాన్ని టాప్ దర్శకుడుగా శాసించిన శంకర్ పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగాలేదు. అతడు దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’ రకరకాల సమస్యల వల్ల ఆగిపోయింది. దీనితో శంకర్ కు ఒక భారీ హిట్ కావాలి ఇలాంటి పరిస్థితులలో రామ్ చరణ్ ను నమ్ముకుని శంకర్ చేస్తున్న ప్రయోగం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: