రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియగానే ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేశారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో రాబోతున్న డంతో ఆరోజున పండుగల ఎంజాయ్ చేయాలని అందరూ భావిస్తున్నారు సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతుండగా సాహో సినిమా తర్వాత ప్రభాస్ రెండేళ్లుగా సినిమా విడుదల చేయలేదు దాంతో ఎన్నో సార్లు ప్రభాస్ అభిమానులు తమ అభిమాన నటుడి సినిమా విడుదల ఎప్పుడు అని దర్శక నిర్మాతలను ప్రశ్నించారు.
అప్డేట్ లో కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో సదరు నిర్మాణ సంస్థను రోల్ చేశారు నెటిజన్లు. ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేసుకుంటూ అభిమానుల కోపాన్ని శాంత పరుస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. దసరా కానుకగా ఈ చిత్రం లోని మొదటి పాటను విడుదల చేయడానికి చిత్రబృదం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా ఈ సినిమా విషయంలో చాలా జాప్యం జరిగింది అన్న విషయం మాత్రం నిజం.
ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా తర్వాత వరుస భారీ ప్రాజెక్టులను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో ఆది పురుష్ సినిమా ద్వారా బాలీవుడ్ డబ్ల్యూ చేస్తున్నాడు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతూ పాన్ ఇండియా హీరోల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ప్రభాస్. ఏదేమైనా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న ప్రభాస్ వచ్చే సంవత్సరం మాత్రం ప్రేక్షకులకు తన సినిమాల పండగ చేయబోతున్నారు అని చెప్పొచ్చు.