బుల్లి తెర ప్రేక్షకుల ఎదరు చూపులకు ఇక టైం వచ్చేసింది. మరి కొన్ని నిమిషాల్లో టాలీవుడ్ స్టార్ హీరో, అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండనున్న మన తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ చాలా అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పటి కే ఈ షో లో ఎవరేవరూ వస్తారనేదాని పై పలుగురి పేర్లు సోషల్ మీడియా వచ్చిన సంగతి తెల్సిందే. అయితే.. ఆ లిస్టు లో బుల్లి తెర, మరియు వెండి తెర... రెండింటి లోనూ చాలా బాగా రాణిస్తోన్న నటి ఉమా దేవి పేరు కూడా ఉండటం విశేషం. ఇక కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి చోటు సంపాదించుకుంది నటి ఉమా దేవి.
అయితే.. కాసేపటి క్రితమే... తన ఎంట్రీ కి ముందే... సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్ట్ చేసింది నటి ఉమా దేవి.
'' భూమి పైన ఉన్న ప్రతి మహిళ ఏదో ఒకటి సాధించాలి అని చాలా ఆతృత గా ఉంటుంది. చాలా ఇష్టం తో ఈ కెరీర్ ను నేను ఎంచుకున్నాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా ఎన్నో రకాల ప్రజలకు నచ్చిన సినిమా లు దాదాపు వంద కు పైగా నే మూవీ స్ లో చేశాను. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్నటు వంటి పాపులర్ కమెడియన్స్ లలో మొత్తం అందరితోనూ చేసేశాను. అలాగే... 15 కు పైగా టీవీ సీరియల్స్ లో కూడా చాలా మంచి పాత్రలు చేశాను. ఆ టీవీ సీరియల్స్ లలో చంద్రిక, రజిని., భాగ్యం ఇలా చాలా సీరియల్స్ బాగా నడిచాయి. అందులో నేను నటించడం చాలా గొప్పతనం. ఆ సిరియళ్ల కారణంగా తన రేంజ్ ఎక్కడికో వెళ్లింది. ఇక ఇప్పుడు నేను ఏంటో తెలిసి వచ్చింది. ఇక ఇప్పుడు నేనేంటో తెలియపరచడానికి మీకు... మరో కొత్త అడుగును వేయబోతున్నాను. అంతేకాదు... దీని పై మీ యొక్క సపోర్ట్ కావాలి. అలాగే నా వెనుక ఉండి..నన్ను ఎంకరేజ్ చేయండి. మొదట్లో లాగే... మళ్లీ తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని అందిస్తాను. మొదటి సారి నా లైఫ్ వేస్తున్న ''బిగ్''స్టెప్. అదేంటో ఇవాళ తెలుస్తుంది '' అంటూ పోస్ట్ చేసింది ఉమాదేవి.