మా క్యాస్ట్ లో అమ్మాయిలు దొరకడం లేదు : విశ్వక్సేన్
సాధారణంగా సినీ సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు విశ్వక్సేన్ పెళ్లి గురించి చర్చ మొదలు కాకముందే తన పెళ్లి గురించి తానే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. 30 ఏళ్లు దాటిపోతున్నాయి జుట్టు రాలిపోతుంది పొట్ట కూడా వచ్చేస్తుంది ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి అంటూ చెబుతున్నాడు విశ్వక్ సేన్. అయితే యువ హీరో చెప్పాడు కదా అని నమ్మితే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విశ్వక్సేన్ చెప్పింది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఇక టక్ వేసుకొని క్లీన్ షేవ్ తో వచ్చిన విశ్వక్సేన 30 వయస్సు దాటి పోయింది.. ఇక జుట్టు కూడా రాలిపోతుంది కూడా.. పొట్ట వచ్చేసింది.. మా క్యాస్ట్ లో అసలు అమ్మాయి దొరకడం లేదు. మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి చూడొచ్చు కదా.. నాకైతే పెద్ద పట్టింపు లేదు ఏమీ లేదు.. ఇక కట్నం కూడా వద్దు.. నా పేరు అర్జున్ కుమార్ అల్లం.. తప్పకుండా అమ్మాయిని చూడండి.. అంటూ విశ్వక్సేన్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. విశ్వక్సేన్ హీరోగా విద్యాసాగర్ చింత దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాకి అశోకవనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.