టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ,విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రాజమౌళి.అయితే మన
టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ రాజమౌళి గత మూడు సంవత్సరాలుగా
ఆర్ఆర్ఆర్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం పూర్తయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే క్వాలిటీ విషయంలో
రాజమౌళి ఏ మాత్రం తగ్గడు అన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో
ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం హీరోలను మళ్లీ సెట్స్ పైకి పిలిచారట.
మరి ఈ హీరోలను
రాజమౌళి ఎందుకు పిలిచినట్టు..?జక్కన్న ప్యాచ్ వర్క్ కోసం పిలిచాడా..? లేక ఇతర కారణాల వల్ల పిలిచాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే మరోవైపు
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కూడా మారనుందని తెలుస్తోంది. ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు.ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాని రిలీజైన సినిమాలు థియేటర్లలో భారీ మొత్తంలో కలెక్షన్లను సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి.అయితే చరణ్,రాంచరణ్ లు మాత్రం కొత్త సినిమాల్లో చేయాలని భావించారు. కానీ
రాజమౌళి పిలిచి వారికి ఒక విధంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.
ఇక సినిమాలో
అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం
భీమ్ గా
తారక్ కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో
అలియా భట్,
ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించనున్నారు. శ్రియ, సముద్రఖని,
అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో క పలువురు
హాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో దేశ వ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ
సినిమా మాత్రం వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఉగాదికి ఈ
సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే కానీ నమ్మలేం..!!