సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందాక యూ ట్యూబ్ వాడకం బాగా పెరిగింది. చాలా మంది కూడా యూ ట్యూబ్ కి బాగా అలవాటు పడిపోయారు.ఏదైనా సాంగ్ కాని టీజర్ కాని సినిమా కాని యూ ట్యూబ్ లో రిలీజ్ అయ్యి తమకు నచ్చిందంటే ఇక రికార్డు స్థాయిలో దాన్ని చూసేస్తారు. ఇక తమ అభిమాన హీరో నుంచి ఏ చిన్న అప్ డేట్ అయినా కాని లేక ఏ వీడియో లీకైనా కాని ఇక దాన్ని వైరల్ చేసేదాకా ఊరుకోరు. ఇక మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు టాప్ హీరోలుగా ఈ జనరేషన్ లో దూసుకుపోతున్నారు.ఇక ఈ మధ్య వీరి సినిమాలకు సంబంధించిన టీజర్స్ యూ ట్యూబ్ లో రిలీజ్ బాగా వైరల్ అయ్యాయి.ప్రభాస్ సినిమా టీజర్ తప్ప మిగిలిన హీరోల టీజర్ లు యూ ట్యూబ్ లో రిలీజ్ అయ్యాయి.
ఇక అందులో హైయెస్ట్ లైక్స్ రాబట్టిన టీజర్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న పుష్ప సినిమా నిలిచింది. ఈ సినిమా టీజర్ 1.8 మిలియన్ లైక్స్ సంపాదించి మొదటి స్థానంలో నిలిచింది.ఇక రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ 1.4 మిలియన్ లైక్స్ సంపాదించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక అలాగే సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా 1 మిలియన్ లైక్స్ తో మూడవ స్థానంలో నిలిచింది.ఇక అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సీతా రామరాజు టీజర్ 966k లైక్స్ తో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ 950k లైక్స్ తో ఐదవ స్థానంలో నిలిచింది.ఇలా ఈ టీజర్ లు తెలుగు సినిమాలలో ఎక్కువ లైక్స్ అందుకున్న టీజర్ లుగా టాప్ 5 లో నిలిచాయి.