హీరోయిన్ నుండి ఐటెం గర్ల్ గా... ?

VAMSI
సినిమా పరిశ్రమలో ఎదో ఒక విధంగా స్థిరపడాలని చాలా మంది నటీనటులు కలలు కంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అవకాశాలు దక్కించుకుని మంచి స్థాయిలో కొనసాగుతారు. ఇప్పుడు హీరోలు మరియు హీరోయిన్లకు మాత్రమే కాకుండా ఐటెం సాంగ్ లలో నర్తించే వారికి కూడా టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఎంతో మంది ఐటెం భామలుగా కొనసాగుతుండగా రీసెంటుగా ఒక్క సినిమాలో చేసిన ఐటెం సాంగ్ తో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. ఆమె ఎవరో కాదు అప్సర రాణి. అప్సర రాణి ఆర్ రఘురాజ్ డైరెక్ట్ చేసిన 4 లెటర్స్ అనే సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.

ఇందులో అప్సర పాత్ర క్రిటిక్స్ ను మెప్పించింది. ఈ సినిమా తర్వాత సత్య ప్రకాష్ అనే డైరెక్టర్ చేసిన "ఊల్లాల్లా ఊల్లాల్లా..."  అనే మూవీలో నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. కానీ తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత ఎంటర్ అయ్యాడు ప్రముఖ వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇతను "థ్రిల్లర్" అనే రొమాంటిక్ హార్రర్ మూవీని తెరకిక్కించాడు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసిన ఆపేసారు రాణి, అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తను టాలీవుడ్ దృష్టిలో పడింది. ఓకె ఈ అమ్మాయి బాగుంది అని అనుకున్నారు.

అలా రవితేజ నటించిన "క్రాక్" మూవీలో ఐటెం సాంగ్ కు సెలెక్ట్ చేశాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో "భూమ్ భూమ్ బద్దలు ..." అనే ఐటెం సాంగ్ లో ఆడి పాడింది. ఈ సాంగ్ ప్రతి ఒక్క మాస్ ప్రేక్షకుడిని అల్లాడించింది. ఈ సినిమా విజయంలో ఈ పాట కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఈ పాటతో ఐటెం సాంగ్ లకు మోస్ట్ వాంటెడ్ భామగా పేరు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: