సినిమా కోసం ఆ భాషను నేర్చుకున్న రకుల్..?
ఇక తన రెండవ సినిమాగా కొండపొలం సినిమా డైరెక్టర్ క్రిష్ తో తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానున్నట్లు ఆ చిత్ర యూనిట్ బృందం తెలియజేసింది. ఇక ఈ మూవీ లో రకుల్ ఒక గిరిజన యువతి పాత్ర లో నటించింది.
కొండపొలం అనే ఊరు లోని ఓబులమ్మ పాత్రలో నటిస్తోంది. ఇక ఈ పాత్రకు ఈమె గిరిజన అమ్మాయిగా కనిపించనుంది. అందుకోసం ఆమె వారి భాషను నేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డానని.. ఒక సందర్భంలో తెలియజేసింది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఒక పల్లెటూరు గిరిజన అమ్మాయి గా తన బాడీ లాంగ్వేజ్ ని మార్చు కొని, గొర్రెలు కాసే కాపరి పాత్ర కోసం చాలా కష్టపడ్డాం అని ఒక సందర్భంలో తెలియజేసింది రకుల్.
ఇక ఈ మధ్యనే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ సినిమాతో నైనా కలిసి వస్తుందేమో చూడాలి. ఇక ఇందులో ఒక సీను కోసం దాదాపు వెయ్యి గొర్రెల తో సెట్ లో షూటింగ్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎం ఎం కీరవాణి అందిస్తున్నాడు. ఏది ఏమైనా ఒక సినిమా సక్సెస్ పొందాలి అంటే, అందులో నటీనటులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.